సిద్దిపేట: రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ నేరెళ్లలో దళితులపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలకు గురిచేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక, డ్రగ్స్, భూ మాఫియాలు చెలరేగిపోతున్నాయని ఆయన అన్నారు. త్వరలో రాష్ట్రంలో బీజేపీ చీఫ్ అమిత్‌షా పర్యటించనున్నారని, ఆయన పర్యటనతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు ఖాయమని స్పష్టం చేశారు. 2019లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని లక్ష్మణ్ తెలిపారు.