హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్ వైద్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రెండోరోజూ ఓపీ సేవలు నిలిపివేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం రాత్రి రోగి బంధువులు దాడి చేశారంటూ జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కరించేవరకు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ వారితో చర్చలు జరిపినప్పటికీ జూడాలు వెనక్కి తగ్గలేదు. దీంతో వారి డిమాండ్లపై కమిటీ వేశారు. కమిటీ నివేదిక గురువారం వచ్చే అవకాశముంది. కమిటీ నివేదికలోని అంశాలను చూసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జూడాల సంఘం అధ్యక్షుడు అభిషేక్ తెలిపారు.