హైదరాబాద్: హరిత తెలంగాణ సాధనకు ప్రైవేటు సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హరితహారంలో భాగంగా సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి ఆవరణలో ఆస్పత్రి ఎండీ భాస్కర్‌రావు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ.. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ముందుకు రావడం సంతోషదాయకమన్నారు. కిమ్స్ ఆస్పత్రి ముందున్న మినిస్టర్ రోడ్డులో మొక్కలు నాటి వాటి సంరక్షణకు 2వేల ట్రీ గార్డుల ఏర్పాటు చేయాలని కిమ్స్ యాజమాన్యం నిర్ణయించింది. దీని కోసంరూ.2లక్షల చెక్‌ను మంత్రికి కిమ్స్ ఎండీ అందజేశారు.