హైదరాబాద్ : బీఎన్‌రెడ్డి కార్పొరేటర్ లక్ష్మీ కుమారుడు మనీష్‌గౌడ్ దాడి ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కడ్తాల్ టోల్‌గేట్ సిబ్బందిపై తన అనుచరులతో కలిసి మనీష్‌గౌడ్ దాడి చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కడ్తాల్ ఘటనను ప్రస్తావిస్తూ.. ప్రియావ్ దేశాయి అనే వ్యక్తి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. ఇలాంటి ఘటనల వల్ల మీకు చెడ్డ పేరు వస్తుందని ట్వీట్‌లో పేర్కొన్నాడు దేశాయి. ప్రియావ్ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రిట్వీట్ చేశారు. కేసులు నమోదు చేశామని తెలిపారు కేటీఆర్. ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడిన చర్యలు ఉంటాయని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆరుగురు నిందితులపై సెక్షన్ 307 కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు కేటీఆర్. ఈ ఘటనలో ఆరుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. కత్తితో దాడి చేసిన అరుణ్ ఏ1గా, మనీష్‌గౌడ్‌ను ఏ4గా పోలీసులు పేర్కొన్నారు.