హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌ను అరెస్టు చేసేందురు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. విక్రమ్ పైన కాల్పులు అనేక మలుపులు తిరుగుతోన్న విషయం తెలిసిందే. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదయింది.
సెక్షన్ 120, 120బి, 420, 404, ఆయుధాల చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు. ఆయనను ఆసుపత్రిలోనే అరెస్టు చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఫోన్ కాల్స్ చేయకుండా ఆయన వాట్సాప్ ద్వారా అంతా కథ నడిపాడు. ఆ మొబైల్ డాటానే ఇప్పుడు ఆయనను ప్రధానంగా పట్టించిందంటున్నారు.తనపై కాల్పుల విషయంలో విక్రమ్ గౌడ్ ఆరు నెలల క్రితమే పక్కా ప్లాన్ తయారు చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కథ నడిపించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa