కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీ ఎంత సంపన్నుడో అందరికీ తెలిసిందే. అభిమానులు అతన్ని ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా అని ముద్దుగా పిలుచుకుంటారు. తాజాగా దాదా ఓ ముఖ్యమైన సమావేశానికి హాజరయ్యేందుకు తన లగ్జరీ బీఎమ్‌డబ్ల్యూలో వెళ్తుండగా కారులో సమస్య తలెత్తిందది. దీంతో అతను క్యాబ్‌ను ఆశ్రయించాడు.అసలేం జరిగిందంటే కోల్‌కతాలో మంగళవారం బీసీసీఐ పర్యటనల ప్రణాళిక కమిటీ సమావేశమైంది. ఈ కమిటీకి గంగూలీ అధ్యక్షుడు. సమావేశానికి హాజరయ్యేందుకు గంగూలీ తన ఇంటి నుంచి బీఎమ్‌డబ్ల్యూ కారులో బయలుదేరాడు. మధ్యలో కారు బ్రేకింగ్ సిస్టమ్‌లో సమస్య తలెత్తింది. సమావేశానికి ఆలస్యం అవుతుందని భావించిన గంగూలీ వెంటనే క్యాబ్‌ను ఆశ్రయించి నిర్ణీత సమయంలో గమ్యస్థానానికి చేరిపోయాడు. దీనిపై గంగూలీ మాట్లాడుతూ.. ‘మార్గమధ్యలో కారులో సమస్య తలెత్తింది. కమిటీ సభ్యులతో సమావేశం చాలా ముఖ్యమైనది. దీంతో వెంటనే క్యాబ్ సర్వీసును ఆశ్రయించాను’ అని తెలిపాడు.
జులైలో బలూర్‌ఘట్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి గంగూలీ మామూలు ప్రయాణికుడిలా రైల్లో వెళ్లిన సంగతి తెలిసిందే.