తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి గట్టెక్కుతోంది. ప్రైవేట్ రవాణాకు దీటుగా బస్సులను కొత్త రూట్లలో ప్రవేశపెట్టడం, అంతర్రాష్ట్ర సర్వీసుల పెంపు, కొత్త ప్రణాళికల అమలు వంటివి సంస్థ నష్టాలు తగ్గించుకోవడానికి దోహదపడ్డాయి. 2016-17 తొలి త్రైమాసికంతో పోల్చుకుంటే 2017-18 తొలి త్రైమాసికంలో టీఎస్‌ఆర్టీసీ 44 కోట్లకు పైగా నష్టాలను తగ్గించుకున్నది. ముఖ్యంగా హైదరాబాద్, కరీంనగర్ వంటి కీలకజోన్లు నష్టాల నుంచి లాభాల బాటలో పయనిస్తుండడం గొప్ప పరిణామంగాభావిస్తున్నారు సంస్థ ఉన్నతాధికారులు. రాష్ట్రంలో మిగతా గ్రామీణ జోన్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 6 కోట్ల 61 లక్షల లాభాలు ఆర్జించాయి.