లక్ష్యాస్ నెచురల్ ఫుడ్స్ స్టోర్‌ను మంత్రి ఈటెల ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పూర్వ కాలంలో ఎటువంటి కెమికల్స్ వాడకుండ స్వచ్చమైన ఆహారపు ధాన్యాల్ని వాడే విధానం ఉన్న ఎక్కువ దిగుబడి, తక్కువ సమయం లో పంట దిగుబడి రావలని ఇప్పటి రైతులు అనేకరకాల మందులు వాడటం వల్ల ఒక రకమైన జీవన విద్వంసం జరిగిందని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. పెంటకుప్పలు, వానపాములు, ఆవు మూత్రం తో అప్పటి వ్యవసాయం ఇప్పుడు మచ్చు కైనా కానరాకపోవటం దురద్రుష్ట కరమన్నారు. మట్టి కుండల్లో వంట లు వండే కాలం నుండి ఫాస్ట్ ఫుడ్ కు అలవాటైన ఈతరం వారికి తిరిగి స్వచ్చమైన , అరోగ్య కరమైన బియ్యం, పప్పు దినుసుల్ని అందించే ప్రయత్నం చేయటం ఒక రకంగా సవాలేనని, ఇటువంటి సవాలు స్వీకరించి అమెరికా, భారదేశంలో పరిశోధన చేస్తూ సొంతంగా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ రైతులకు మెలైన వ్యవసాయ పద్దతులు వివరించడం నిజంగా అభినందనీయమని ఈటెల కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఈటెలతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కో్సం యువత తమవంతు కృషి చేయాలని మంత్రులు పిలుపు నిచ్చారు. లక్ష్యాస్ వ్యవస్థాపకుడు సతీష్ కనపర్తి కృషిని అభినందించారు.