నిజామాబాద్ జిల్లాలోని ఖానాపూర్ లో కుర్ కురే ఫ్యాక్టరీ పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలోని ఖానాపూర్ లో ఉన్న నరేష్ హెల్దీ ఫుడ్ ప్రాడక్ట్, ముభారక్ నగర్ లో ఉన్న శ్రీ వైష్ణవి ఫ్లోర్ మిల్ అండ్ స్పైసెస్ కంపెనీలలో తయారవుతున్న స్నాక్స్ ఐటెమ్ కుర్ కురే కల్తీ అవుతున్నదని తెలుసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటిపై దాడులు నిర్వహించారు. దాడులు నిర్వహించి కంపెనీల నుంచి సాంపిల్స్ సేకరించి వాటిని ల్యాబ్ కు పంపించారు. ఈ దాడుల్లో ఫుడ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది తో పాటు నిజామాబాద్ రూరల్ సౌత్ సీఐ పాల్గొన్నారు.