కర్ణాటక మంత్రి డీకే శివకుమార్, ఎంపీ డీకే సురేష్ ఇళ్లపై ఐటీ దాడులు చేసింది. అటు బెంగుళూరు, కనకపురా, సదాశివనగర్ తో పాటు 39 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్టులోనూ తనిఖీలు చేశారు. ఉదయం ఏడింటికి మొదలైన తనిఖీలు..ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు భారీగా డబ్బు దొరికినట్ల సమాచారం. శివకుమార్ గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వసతి బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. దాంతో ఆయన్ని టార్టెట్ చేసి.. కేంద్రం ఐటీ దాడులు జరిపించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.