-నామినేటెడ్ పదవుల నియామకం
-17 మంది మంు్తల్రకు బాధ్యత
-పార్టీకోసం పనిచేసిన ఉద్యమ నేతలకే అకాశాలు
-నేతలకు పదవులే పదవులు
హైదరాబాద్, సూర్య ప్రధానప్రతినిధి: టీఆర్‌ఎస్ నేతలు, కార్య కర్తలు గత రెండున్నరేళ్లుగా పదవుల కోసం కన్నకలలు నిజం కాబో తున్నాయి. రాష్ట్రంలోని అన్ని నామినేటెడ్ పోస్టులను ఉగాదిపండుగ లోగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇక రాష్ట్రంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ముఖ్యనాయకులకు పదవుల అదృష్టం వరించబోతున్నది. ఉగాదిలోగా రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టు లన్నీ భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అదేశించారు. ఈ బాధ్యతను 17మంది మంత్రుల మీద పెట్టారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకే అవకాశమివ్వాలని దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ స్థాయి, ఆ లోపు పదవుల అంశం మీద రేపటినుంచి పూర్వ జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు వేల పదవులను భర్తీ చేయనున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కీలకమైన కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించింది. రాష్టస్థ్రాయిలో విభజన ప్రక్రియను పూర్తిచ ేసుకున్న మిగిలిన కార్పొరేషన్లకు కూడా ఈ సారి ఛైర్మన్లతోపాటు పాలకవర్గాలను నియమించాలని నిర్ణయించింది. దీనికి సంబంధిం చిన కసరత్తును వెంటనే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి తన సహచర మంత్రులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే మార్కెట్ కమిటీల నియామకం దాదాపుగా పూర్తికావచ్చింది. అక్కడక్కడా మిగిలిన మార్కెట్ కమిటీలకు ఈ విడత ఛైర్మన్లను నియమించనున్నారు. అనేక చోట్ల ఛైర్మన్ల నియామకం పూర్తయినా మార్కెట్ కమిటీలకు డైరెక్టర్లను పూర్తిగా నియమించలేదు. ఇప్పుడు డైరెక్టర్ల నియామకం పూర్తి చేస్తారు. ఇక జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఉండే పుడ్ అడై్వజరీ బోర్డు సభ్యులు, గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్లు, పాలకవర్గాలు, దేవాలయ కమిటీలు, నియోజకవర్గాలు, జిల్లాస్థాయి అసైన్‌మెంట్ కమిటీలు తదితర పదవులను కూడా భర్తీ చేయనున్నారు.
నాలుగు వేలమందికిపైగా పదవులు...?
రాష్టవ్య్రాప్తంగా దేవాలయాలు, గ్రంథాలయాలు, మార్కెట్ కమిటీలు, ఫుడ్ అడై్వజరీ కమిటీలు, వన సంరక్షణ కమిటీలు, వైద్యశాలల అభివృద్ధి కమిటీలు.. ఇలా సుమారు 20 రకాల కమిటీల్లో సుమారు నాలుగువేల వరకు పదవులు ఉంటాయని అంచనా. ఈ భర్తీ ప్రక్రియతో కనీసం నాలుగు వేల మందికి పదవులు లభిస్తాయని భావిస్తున్నారు. పార్టీకోసం, తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింసే ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు మంత్రులు జిల్లాలు, నియోజకవర్గాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలతో చర్చించి జాబితాలను సిద్ధం చేయబోతున్నారు. ఎవరెవరికి ఏఏ పదవులు ఇవ్వాలన్నది జాగ్రత్తగా చూడాలని, వివాదాలు రాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి మంత్రులకు సూచించినట్లు తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa