-కేంద్ర, రాష్ట్ర సంస్థల భూములపై కన్ను
-మార్చినాటికి ఇళ్ల నిర్మాణం ప్రారంభం
-ల్యాండ్‌బ్యాంక్‌పై సమీక్ష : మంత్రి కేటీఆర్
హైదరాబాద్, సూర్యప్రధానప్రతినిధి : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఉచితంగా నిర్మించతలపెట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలపై సర్కార్ శ్రీకారం చుట్టింది. నగరంలో డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ, అనుమతులు తదితర అంశాలపై మంగళవారంనాడు మున్సిపల్, మైనింగ్, ఐటి, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఉన్నతస్థాయి సమీక్షించారు. నగరంలో డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి ఇప్పటి వరకు గుర్తించిన స్థలాలు, అనువైన స్థలాలపై ఆయన సమీక్షించారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యస్పీ సింగ్ కార్యాలయంలో, హౌసింగ్, జియచ్ యంసి, రంగారెడ్డి, హైదరాబాద్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. . ఈ సమావేశంలో డబుల్ బెడ్ రూం కార్యక్రమానికి అవసరం అయిన ల్యాండ్ బ్యాంకు ఏర్పాటుపైన ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని, ఈ కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకుపోవాలని అధికారులను అదేశించారు. మార్చి నెల నాటికి సాద్యమైనన్ని ఎక్కువ ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యేలా చూడాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాల కొరత తీవ్రంగా ఉందని, ఉన్న స్థలలలో కోర్టుకేసులున్నాయని రెవెన్యూశాఖ అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు 175 స్థలాలను పరిశీలించగా అందులో కేవలం 75స్థలాలు మాత్రమే అనువుగా ఉన్నాయని వివరించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నగరంలో భూమి కొరత ఉన్నందున, కేంద్ర రాష్ర్ట, ప్రభుత్వ సంస్ధల వద్ద ఉన్న భూములను ఈ కార్యక్రమానికి కేటాయింపులు జరిగేలా చూడాలని మంత్రి కెటి రామారావు సీఎస్‌ను కోరారు. ఈ మేరకు అవసరమైన పరిపాలన పరమైన చర్యలు చేపట్టాలన్నారు. నిరుపయోగంగా వివిధ శాఖల వద్ద ఉన్న భూములను ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని కోరాలని మంత్రి అధికారులకు అదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరం అయిన అనుమతులకు అయా మంత్రులను స్వయంగా కలిసి విజ్ఘప్తి చేస్తామన్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్, నాంపల్లి ప్రాంతాల్లో ఉన్న రైల్వే భూములను డబుల్ బెడ్ రూంలకు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరతామన్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తామని గతం కేంద్ర మంత్రులు హమీ ఇచ్చిన నేపథ్యంలో పాలన పరమైన చర్యలు చేపట్టలన్నారు. ఈ మేరకు రైల్వే శాఖ నుండి హజరయిన అధికారులు వారంలోపల అందుబాటులో ఉన్న భూముల వివరాలను జియచ్ యంసి అదికారులకు అందజేస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa