ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రగ్స్ కేసుపై స్పందించిన పవన్ కళ్యాణ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 03, 2017, 02:28 PM

టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసు విషయంపై నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ స్పందించారు. కేసు విచారణ జరిగిన 10 రోజులు ఇండస్ట్రీకి చీకటి రోజులుగా వర్ణిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖలని తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ చలన చిత్ర కూటమి తరపున మీకు అప్పీల్ చేసుకుంటున్నామని ట్వీట్ చేశాడు పవన్. తెలుగు సినిమా 2000 కోట్ల రూపాయలు దాటిన సంతోషంలో.. ఒక దర్శకుడికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన ఆనందంలో.. తెలుగు పరిశ్రమ వెలిగిపోతున్న సమయంలో .. మమ్మల్ని కమ్మిన గ్రహణం మాద‌క ద్రవ్యాల కేసు అని తెలుగు సినిమా ఇండస్ట్రీ తమ లేఖలో పేర్కొంది. ఈ మాదక ద్రవ్యాల కేసుని వెలుగులోకి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించాలని తెలుగు మూవీ ఇండస్ట్రీ లేఖలో పేర్కొంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa