ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా ప్ర‌క‌టించాలి: ఎంపీ వినోద్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 03, 2017, 02:30 PM

న్యూఢిల్లీ: హైదరాబాద్ , రామగుండం మధ్య ఉన్న రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని ఎంపీ వినోద్ కుమార్ కేంద్రాన్ని కోరారు. లోక్ సభ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో జాతీయ రహదారుల విషయంలో తెలంగాణ‌కు అన్యాయం జరిగిందన్నారు. ఇదే విషయంపై ఇప్పటకే సీఎం కేసీఆర్ చాలాసార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారని గుర్తు చేశారు. అయితే దీనిపై స్పందించిన గడ్కరీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.హై వే కాంట్రాక్టుల విష‌యంలో వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పైన కూడా మంత్రి స్పందించారు. కాంట్రాక్టుల కోసం లంచాలు ఇచ్చార‌న్న ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు గ‌డ్క‌రీ తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa