శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు చాలా అవసరమని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవ్వాలని ఆయన ఆకాంక్షించారు. అందుకు సంబంధించిన పూర్తి సహాయ సహాకారాలు అందిస్తామన్నారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో మినీ స్టేడియం, ఆఫీసర్స్ క్లబ్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ క్రీడా కేంద్రాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు సిద్దిపేట ఆదర్శంగా నిలుస్తోందని హెచ్‌సీఎ చైర్మన్ వివేక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో పాటు పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa