ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిట్టలు పట్టి జీవించేవాళ్లకు డబుల్ బెడ్రూం ఇళ్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 04, 2017, 03:21 PM

పిట్టలు పట్టి జీవించేవాళ్లకు సొంతిల్లు అనేది ఓ కల అని, దానిని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిజం చేసిందని మంత్రి హరీష్ రావు అన్నారు.  వారికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మందపల్లిలో 20 డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించారు. లబ్దిదారులకు ఇళ్లను అప్పగించారు. పేదలు ఆత్మగౌరవంతో బ్రతకాలనేదే సీఎం కేసీఆర్ ఆశయమని హరీష్ రావు తెలిపారు. పిట్టలు పట్టేవాళ్లు తమ పిల్లలకు షికార్ నేర్పకుండా మంచి చదువులు చదివించాలన్నారు. అందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.  ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అమ్మినా, కొన్నా, కిరాయికి ఇచ్చినా కేసులు తప్పవని హరీష్ రావు హెచ్చరించారు. ఎవరికి ఇచ్చిన ఇళ్లలో వాళ్లు పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్  పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa