న్యూఢిల్లీ : కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీని టీఆర్ఎస్ ఎంపీ కవిత, నిజామాబాద్ పార్లమెంటరీ నియోజక వర్గంలోని ఎమ్మెల్యేలు ఢిల్లీలో కలిశారు. జగిత్యాలలో పలు బైపాస్ రోడ్లను నిర్మించాలని గడ్కరీకి వారు విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్-ధర్మపురి జాతీయ రహదారి 63లో చల్ గల్ నుంచి పొలాస మధ్య బైపాస్ అవసరాన్ని కేంద్రమంత్రికి కవిత బృందం వివరించింది. నిజామాబాద్-కరీంనగర్ రోడ్ లో చల్ గల్-అంతర్ గావ్-దారూర్-రాజారం గ్రామాల మీదుగా బైపాస్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జగిత్యాలను అనుసంధానం చేసేలా జాతీయ రహదారి 563-జాతీయ రహదారి 63 ను కలుపుతూ దారూర్-నర్సింగాపూర్-పొలాస గ్రామాల మీదుగా మూడవ బైపాస్ రోడ్ వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మూడు బైపాస్ లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రిని కవిత కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa