ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అస్వస్థత!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 04, 2017, 06:45 PM

తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  అస్వస్థతకు గురయ్యారు. సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత వారం రోజులుగా అల్సర్ తో బాధపడుతున్న ఆయన అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు తెలిపారు. అల్సర్ కారణంగా ఆయనకు వాంతులు అయ్యాయని, బీపీ, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు రెండు రోజుల చికిత్స అవసరమని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని,  అబ్జర్వేషన్ లో ఉంచామని, ఆ తర్వాత డిశ్చార్జి చేస్తామని వైద్యులు పేర్కొన్నారు. కాగా, తుమ్మల ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. తుమ్మలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa