ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేశవరం గ్రామాభివృద్ధికి రూ.12 కోట్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 04, 2017, 07:40 PM

మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం కేశవరం గ్రామంలో మౌలిక సదుపాయల కోసం రూ.12 కోట్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేశవరంలో గ్రామసభ నిర్వహించిన ముఖ్యమంత్రి, గ్రామస్తులతో మాట్లాడారు. వారికి ఏం కావాలో అడిగి తెలుసుకున్నారు. గజ్వేల్ తో సమానంగా మేడ్చల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు పూర్తయితే చెరువులన్నీ నిండుతయని, గోదావరి జలాలతో కేశవరం చెరువు నింపుతామని చెప్పారు. చెరువు నింపిన రోజున తాను మళ్లీ వస్తానన్నారు. కేశవరంలో మౌలిక సదుపాయాల కోసం రేపు మధ్యాహ్నం కల్లా జీవోలు ఇస్తామని, ఎల్లుండి నుంచే పనులు ప్రారంభం అవుతాయని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, కలెక్టర్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa