ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక నుంచి డెత్ స‌ర్టిఫికెట్ కూ ఆధార్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 05, 2017, 09:22 AM

న్యూఢిల్లీ: మరణించిన వ్యక్తి గుర్తింపును నిర్ధారించేందుకు అక్టోబర్ 1 నుంచి ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం.. చనిపోయిన వ్యక్తి తాలూకు మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాలంటే సదరు వ్యక్తి ఆధార్ నంబర్‌ను లేదా ఆధార్ దరఖాస్తు నమోదు సంఖ్య (ఈఐడీ)ను అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. చనిపోయిన వ్యక్తికి ఆధార్ నంబర్ లేకపోతే.. ఆ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఒక పత్రాన్ని సమర్పించాలి.


ఈ మేరకు కేంద్ర హోంశాఖ పరిధిలోని భారత రిజిస్ట్రార్ జనరల్ (ఆర్‌జీఐ) కార్యాలయం శుక్రవారం ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. చనిపోయిన వ్యక్తుల వివరాల నమోదుకు, గుర్తింపునకు సంబంధించిన మోసాలను అరికట్టేందుకు ఇది మేలైన పద్ధతని అధికారులు పేర్కొన్నారు. ఆధార్ ఉంటే.. గుర్తింపును నిర్ధారించేందుకు ఇతర ఏ పత్రాలూ అవసరం లేదని వివరించారు. జమ్ముకశ్మీర్, అసోం, మేఘాలయ మూడు రాష్ర్టాలకు తర్వాత నోటిఫికేషన్ జారీ చేయనున్నారు










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa