ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌ పాతబస్తీలో నిర్బంధ తనిఖీలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 05, 2017, 10:13 AM

హైదరాబాద్‌: నేరస్థులకు అడ్డాగా మారిన పాతబస్తీ శివారు ప్రాంతాల్లో దక్షిణ మండలం పోలీసులు పెద్దయెత్తున నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 84 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసుకున్న ముఠాను పట్టుకున్నారు. 56 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.


అసద్‌ బాబా నగర్‌, కిషన్‌ బాగ్‌ ప్రాంతాల్లో పాత నేరస్థులు తలదాచుకుంటున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేశారు. కొందరి ఇళ్లల్లో యాసిడ్‌, కుళ్లిన బంగాళాదుంపలతో తయారుచేసిన కల్తీ అల్లం, వెల్లల్లి పేస్టు డబ్బాలను గుర్తించారు. ప్రమాదకర రసాయనాలతో తయారుచేస్తున్న మెహందీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న 84 మందిలో 20 మంది రౌడీ షీటర్లు, 23 మంది పాత నేరస్థులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి 4 కత్తులు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారి నుంచి వేలిముద్రలు తీసుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa