హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయశంకర్‌సార్ విగ్రహానికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి జయశంకర్ సార్. జయశంకర్ సార్ ఆశయాలను కేసీఆర్ సాధిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. అనంతరం ఎంపీ బూర నర్సయ్య మాట్లాడుతూ... అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. విపక్షాలు అడ్డుకున్నా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆగవు. జయశంకర్‌సార్ ఆశయాలకనుగూనంగా బంగారు తెలంగాణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa