రాఖీ పండుగ కీడుగా వచ్చిందని, ఈ పండుగను ముందుగానే జరుపుకోవాలని వదంతులు వినిపిస్తున్నాయి. ఇది నిజమా.. కాదా అనే విషయంలో ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయమై స్థానిక శ్రీభక్తాంజనేయస్వామి ఆలయ అర్చకులు రాఖీ పౌర్ణమిని సోమవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుపుకోవచ్చని తెలిపారు. అయితే రాఖీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం రాత్రి 10.56 గంటలకు ఉందని, అది కేతుగ్రస్థ చంద్రగ్రహణం. రాత్రి 1.57 గంటలకు పూర్తి మోక్షకాలం ఉందని తెలిపారు. చంద్రగ్రహణంను మకరరాశి వారు, శ్రవణ నక్షత్ర జాతకులు చూడరాదని తెలిపారు. గ్రహణ సమయంలో ఇష్ట దైవం నామ జపం చేస్తూ బ్రాహ్మణులకు, అర్చకులకు వస్త్ర, ధన, ధాన్య, ఫల, రజత దానములు చేయవచ్చునని పేర్కొన్నారు. చంద్రగ్రహణం ఉన్న సందర్భంగా ఉదయం 6గంటల నుంచి మద్యాహ్నం 12గంటలలోపు జంధ్యాధారణ చేయాలని తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి 11.30గంటల వరకు దేవాలయాలు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa