చంద్రగ్రహణం సందర్బంగా సోమవారం మధ్యాహ్నం నుంచి అన్ని ఆలయాలను మూసివేయనున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి మూసివేస్తారు. తిరిగి మంగళవారం తెల్లవారుజామున సంప్రోక్షణ అనంతరం తెరుస్తారు. భద్రాద్రి రాముల వారి ఆలయాన్ని మధ్యాహ్నం 12 గంటలకు మూసివేస్తారు. తిరిగి రేపు ఉదయం సంప్రోక్షణ అనంతరం ఆలయాన్ని తెరిచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం 2 గంటలకు మూసివేసి మంగళవారం తెల్లవారుజామున స్రంప్రోక్షణ అనంతరం 4 గంటలకు తెరుస్తారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం 1.30 గంటలకు మూసివేసి సంప్రోక్షణ అనంతరం రేపు ఉదయం 6 గంటలకు తెరుస్తారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనృహింహస్వామి ఆలయాన్ని ఉదయం 11 గంటలకు మూసివేసి మంగళవారం ఉదయం 10.30 గంటలకు తెరుస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa