ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరుణా బహుగుణ పదవీ విరమణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 12:04 PM

నెరవేరిన కలలతో నేను ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. నా విలువలే నా ఆస్తి అని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ డైరెక్టర్ అరుణా బహుగుణ అన్నారు.  1979 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈమె 39 ఏండ్లపాటు పోలీసుశాఖలో సేవలు అందించి మంగళవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా పోలీసు అకాడమీలో ప్రత్యేక సెరిమోనియల్ కవాతులో ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. “1979లో ఐపీఎస్ అధికారిగా పోలీసుశాఖ (ఏపీ క్యాడర్) లో అడుగుపెట్టానన్నారు. 39 ఏండ్ల సుదీర్ఘ సేవలో అన్నిశాఖల్లో పనిచేశానని, జాతీయ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వర్తించానని తెలిపారు. ఈ పరేడ్ గ్రౌండ్‌లో పొందిన ఆనందం గొప్ప వరం” అని ఆమె తెలిపారు. 39 ఏండ్ల కిందట ఒక ఐపీఎస్‌గా కన్న కలలు, తనలో ఉన్న ఉత్సాహం, నిబద్ధతను 139 శిక్షణా ఐపీఎస్‌లలో చూస్తున్నానని వ్యాఖ్యానించారు. శిక్షణా ఐపీఎస్‌లకు కొన్ని సూచనలు కూడా చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com