ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేములవాడ ఆలయాల్లో సంప్రోక్షణ పూజలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 08, 2017, 11:37 AM

ప్రఖ్యాత వేములవాడ ఆలయంలో రాజరాజేశ్వర స్వామి దర్శనం తిరిగి ప్రారంభమైంది. నిన్న చంద్రగ్రహణం ఉండటంతో మధ్యాహ్నం ఒకటిన్నరకు ఆలయాన్ని మూసివేశారు. ఈరోజు గ్రహణం ముగియడంతో ఉదయం ఆలయంలో సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు పుణ్యస్నానాలు ఆచరించి, కల్యాణమండపంలో పూజలు నిర్వహించారు. ఆలయాన్ని మొత్తం శుద్ధి చేశారు. స్వామి వారికి సుప్రభాత పూజ, గోపూజ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం  భక్తులకు అనుమతించారు. దీంతో ఎములాడ రాజన్న దర్శన భాగ్యం కోసం భక్తులు బారులు తీరారు. అటు నిర్మల్ జిల్లా ప్రసిద్ద పుణ్యక్షేత్రం బాసర శ్రీజ్ఞానసరస్వతీ అమ్మవారి ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించారు.చంద్రగ్రహణం అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. సంప్రోక్షణ తర్వాత అమ్మవారికి అభిషేకం, మహాహారతి పూజలు చేసారు.అటు వేకువజాము నుంచే పవిత్ర గోదావరినదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa