ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ పథకాలపై పన్ను ఆమోదయోగ్యం కాదు: ఈటెల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 08, 2017, 12:17 PM

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునర్జీవ సభ ఏర్పాట్లపై ఆర్థిక మంత్రి ఈటెల సమీక్ష సమావేశం నిర్వహించారు. సభకు భారీ ఎత్తున రైతులు స్వచ్చందంగా తరలి వస్తున్నారని మంత్రి తెలిపారు. ఎవరికీ అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం మంత్రి జీఎస్టీపై వివరించారు. జీఎస్టీ విధివిధానాలను కౌన్సిల్ రూపొందించింది. జీఎస్టీతో రాష్ర్టాలపై అదనపు భారం పడకుండా చూడాలి. జీఎస్టీకి మద్దతు తెలిపి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినం. జీఎస్టీలో కొన్ని వస్తువులపై అధిక పన్నులు విధించడంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆటంకం ఏర్పడుతుంది. సామాన్యుడిపై భారం పడకుండా చూడాలని కేంద్రాన్ని కోరినా పట్టించుకోలేదు. రైతులు, పేదప్రజలు వాడే వస్తువులపై జీఎస్టీ వద్దని కేంద్రాన్ని కోరామని  అయన అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇరిగేషన్ ప్రాజెక్టులపై 18శాతం పన్ను ఆమోదయోగ్యం కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏనాడు రాజీ పడలేదు. కాంగ్రెస్, బీజేపీలు అర్థంలేని విమర్శలు చేస్తున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌కు మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొన్నారు. రాష్ర్టాల అభిప్రాయాలను కేంద్రం గౌరవించాలి. రాష్ర్టాల ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకురావాలి. జీఎస్టీ ప్రతి సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం హాజరైంది. స్టేట్ ఓన్ ట్యాక్స్, రెవెన్యూలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉంది. 33 అంశాల మీద అభ్యంతరాలను జీఎస్టీ మీటింగ్‌లో స్పష్టం చేశామని అయన అన్నారు. అయినా కేంద్రం పట్టించుకోకపోతే పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటామని తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa