సదావర్తి భూముల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ భూములకు మళ్లీ వేలం ప్రక్రియ ప్రారంభించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో ఇంప్లీడ్ అయిన అఖిల భారత బ్రాహ్మణ అసోసియేషన్ సదావర్తి భూములకు మళ్లీ వేలం నిర్వహించాలని కోరింది. దీనిపై హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ తాజాగా మళ్లీ వేలం ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వేలంలో అళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొనవచ్చని పేర్కొంది. ఆరు వారాలలోగావేలానికి సంబంధించి ప్రకటనలను అన్ని పత్రికలలోనూ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తే తదుపురి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa