మేడ్చల్ : శామీర్‌పేట మండలం కేశవరంలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. ఇవాళ మధ్యాహ్నం కేశవరం చేరుకున్న సీఎం.. గ్రామపంచాయతీ భవనంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కేశవరం గ్రామాభివృద్ధికి రూ. 12 కోట్ల నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 4న జరిగిన గ్రామసభలో కేశవరం గ్రామ సమస్యల పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారు. ఆ మేరకే మరుసటి రోజున అభివృద్ధి పనులకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం కేసీఆర్ మరికాసేపట్లో మూడుచింతలపల్లి గ్రామసభలో పాల్గొననున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa