మేడ్చల్ : రాష్ట్రంలోని రైతులందరికీ పెట్టుబడి పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. శామీర్‌పేట మండలంలోని మూడుచింతలపల్లి గ్రామసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా పెట్టుబడి పథకం అమలవుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఈ పథకం అమలవుతుందన్న సీఎం.. ఎకరానికి రూ. 4 వేల పెట్టుబడి ఇస్తామని తెలిపారు. రెండు పంటలకు కలిపి ఎకరానికి రూ. 8 వేల పెట్టుబడి ఇవ్వబోతున్నామని ప్రకటించారు. పెట్టుబడి డబ్బులు నేరుగా రైతు అకౌంట్‌లోనే వేస్తామని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa