హైదరాబాద్ : జంటనగరాల్లో పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తున్నది. సికింద్రాబాద్, పార్శీ గుట్ట, వారాసి గూడ, చిలకల గూడ, అల్వాల్, పద్మారావు నగర్, మారేడ్ పల్లి, బేగంపేట, బంజారాహిల్స్ , పంజాగుట్ట, బోయిన్ పల్లి, అడ్డగుట్ట, తిరుమలగిరి, ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, మేడిపల్లి, ఘట్ కేసర్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతున్నది. వర్షంతో పలు చోట్ల ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడుతున్నది. తెల్లవారుజాము నుంచి ఇప్పటివరకూ అంబర్ పేట్ లో 6 సెం.మీ చొప్పున, బండ్లగూడ, ఎల్బీ నగర్, నారాయణగూడల్లో 5 సెం.మీల చొప్పున, ముషీరాబాద్, బాలానగర్, మౌలాలీ, రామచంద్రపురంలలో 2 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa