ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీపుల్స్‌ ప్లాజాలో ఇన్ఫినిటీ రైడ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2017, 11:35 AM

హైదరాబాద్‌ : ప్రమాదవశాత్తు విధి నిర్వహణలో కాళ్లు, చేతులూ కోల్పోయిన వారిలో ధైర్యం నింపే ఉద్దేశంతో ఇవాళ నగరంలో ‘ఇన్ఫినిటీ రైడ్‌’ ను నిర్వహించారు. మెహతా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సైకిల్‌ యాత్రను నెక్లెస్ రోడ్ పీపుల్స్‌ ప్లాజాలో ఏపీ హోంశాఖ సలహాదారు కోడె దుర్గాప్రసాద్‌ ప్రారంభించారు. ఇన్ఫినిటీ రైడ్ లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 50మంది పారా అథ్లెట్లతో పాటు బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ విభాగాలకు చెందిన పారా అథ్లెట్‌ క్రీడాకారులు పాల్గొంటున్నారు. సైకిల్ యాత్ర హైదరాబాద్‌లో మొదలై ఆగస్టు 15న తిరుపతికి చేరుకుంటుంది. ఈ కార్యక్రమానికి సినీనటి మంచు లక్ష్మి, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ శిల్పారెడ్డి, ఏపీ సీఆర్‌పీఎఫ్‌ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ హాజరయ్యారు. పట్టుదల, అంకితభావంతో సాధన చేస్తే లక్ష్యాలను సైతం అధిగమించేందుకు అంగవైకల్యం అడ్డుకాదనే సందేశం ఇవ్వాలన్నదే ఇన్ఫినిటీ రైడ్‌ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa