ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసుల కస్టడీలో విక్రమ్‌గౌడ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2017, 12:42 PM

హైదరాబాద్: సుపారీ ఇచ్చి మరీ తనపై కాల్పులు జరుపించుకున్న విక్రమ్ గౌడ్ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కేసును పూర్తిగా చేధించామని ప్రకటించినా ఇందులో మరికొన్ని ట్విస్టులు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఈ కేసులో విచారణ కోసం బంజారాహిల్స్ పోలీసులు విక్రమ్‌గౌడ్‌ను బుధవారం ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురిని మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. వారిని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విక్రమ్‌ సహా ఐదుగురు నిందితులను చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు లాయర్ సమక్షంలో నిందితులను పోలీసులు విచారించనున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com