భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం చాతకొండ పంచాయితీ పరిధిలోని కిసాన్ నగర్ లో విషాదం చోటు చేసుకున్నది. కరెంట్ షాక్ తో ఓ వ్యక్తి మృతి చెందాడు. కిసాన్ నగర్ కు చెందిన ఇనుముల పురుషోత్తం (37) పొలం వద్ద మోటర్ వేయడానికి వెళ్లాడు. మోటర్ వేస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు పురుషోత్తం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa