జమ్ము : జమ్మూ -కాశ్మీర్ జతీయ రహదారిపై ఈ రోజు కూడా వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలియజేశారు. ఈ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేయడం వరుసగా ఇది రెండో రోజు. జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో ఈ మార్గంలో రాకపోకలను అనుమతించడం లేదని అధికారులు వివరించారు. విరిగిపడిన కొండ చరియలను తొలగించి, ధ్వంసమైన రోడ్డును నిర్మించే పని కొనసాగుతున్నదని, ఈ పనులు ఈ రోజు సాయంత్రానికి పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa