ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంట్రాక్టు ఉద్యోగులపై సానుభూతి ఎన్నికల కోడ్‌ ముగిశాక మళ్లీ ఉపసంఘం భేటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 12:27 PM

అమరావతి,: కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. వారిపై సానుభూతి ఉందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై మంగళవారం వెలగపూడి సచివాలయంలో యనమల అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మంత్రి కామినేని శ్రీనివాస్‌ కూడా హాజరయ్యా రు. అనంతరం యనమల, గంటా విలేకరులతో మాట్లాడారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై నివేదికను కేబినెట్‌కు సమర్పిస్తామన్నారు. రాష్ట్రంలో 19 శాఖల్లో 26 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారని, ప్రభుత్వం వారి పట్ల సానుభూతితో వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు. క్రమబద్ధీకరణ, జీతాల పెంపు వంటి అన్ని అంశాలపైనా సమావేశంలో చర్చించామని తెలిపారు. అయితే ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటం, అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎన్నికల తర్వాత మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంట్రిబూషనరీ పెన్షన్‌ స్కీం కేంద్రప్రభుత్వానికి సంబంధించిన అంశమని, కేంద్రానికి దీనిపై లేఖ రాస్తామన్నారు










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa