ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూసీ నది సుందరీకరణకు ప్రణాళికలు సిద్ధం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 10, 2017, 07:49 AM

హైదరాబాద్ : నగరంలోని మూసీ నది సుందరీకరణ, అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సచివాలయంలో మున్సిపల్, మూసీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులతో కేటీఆర్ సమావేశమై మూసీ సుందరీకరణపై చర్చించారు. రూ. 1,665 కోట్ల నిధులతో మూసీ నది సుందరీకరణ, అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. రెండు ప్యాకేజీల్లో పనులు చేపడుతామని ప్రకటించారు. రూ. 956 కోట్లతో తొలి ప్యాకేజీ పనులు, రూ. 709 కోట్లతో రెండో ప్యాకేజీ పనులు జరుగుతాయని వెల్లడించారు కేటీఆర్. రూ. 500 కోట్లను బడ్జెట్ నుంచి, మిగిలిన నిధులను బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి సేకరిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. సబర్మతి నదిని అభివృద్ధి చేసిన తీరులోనే మూసీ నది అభివృద్ధి ఉంటుందన్నారు. అవసరమైన పనులు, నిర్మాణాల కోసం అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులకు అనుమతులు వచ్చినందున పనులను మరింత వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa