ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో 48 గంటలలో వర్షాలు కురిసే అవకాశం

Telangana Telugu |   | Published : Thu, Aug 10, 2017, 07:46 AM

హైదరాబాద్ : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నగరంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో బుధవారం తెల్లవారు జామునుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరపిలేకుండా కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. అల్పపీడనం ప్రభావం కారణంగా రానున్న 48గంటల్లో కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో పలు చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల సాధారణం నుంచి మోస్తారు, మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa