ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదివాసీలను కేంద్రం విస్మరిస్తుంది : ఎంపీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2017, 06:10 PM

న్యూఢిల్లీ : ఆదివాసీల దినోత్సవాన్ని కేంద్రం విస్మరిస్తుందని టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ పేర్కొన్నారు. 1994లో ఐక్యరాజ్యసమితి ఆదివాసీ దినోత్సవం జరపాలని నిర్ణయించిందని ఎంపీ గుర్తు చేశారు. బంజార గోర్ బోలి భాషను కేంద్రం అధికార భాషగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. 10 కోట్ల జనాభా ఉన్న ఆదివాసీలను కేంద్రం గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీల భాషాభివృద్ధికి గిరిజన విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు సీతారాం నాయక్. విలువిద్య అభివృద్ధికి ఆర్చ్ అకాడమీ ఏర్పాటు చేయాలన్నారు. ఆదివాసీల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకువచ్చిందని తెలిపారు. ఎస్టీల కోసం 22 డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు తమ జాతి పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు ఎంపీ. 50 గురుకుల పాఠశాలలు సైతం సీఎం కేటాయించారని గుర్తు చేశారు. ఒక్క ఏకలవ్య పాఠశాలను కూడా కేంద్రం ఇవ్వలేకపోయిందన్నారు. పార్లమెంటులో గిరిజన అంశాలు లేవనెత్తుతున్నందుకు అన్ని పార్టీల గిరిజన ఎంపీలు తమకు మద్దతు తెలుపుతున్నారని సీతారాం నాయక్ స్పష్టం చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa