హైదరాబాద్ : హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో అమలవుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలో పాయింట్ల విధానంపై ఆర్టీఏ అధికారులు పునరాలోచనలో పడ్డారు. కొన్ని ఉల్లంఘనలకు పాయింట్లు విధించరాదని అధికారులు నిర్ణయించారు. ఏడు రకాల ఉల్లంఘనలకు పాయింట్లు విధించరాదని ఆర్టీఏ నిర్ణయించింది. రాంగ్ పార్కింగ్, ఆటో పైలెట్, ఓవర్ లోడ్ తప్పులపై పాయింట్ల విధింపులు మార్పులు చేయనున్నారు. జీబ్రా లైన్ క్రాసింగ్, బీమా, పొల్యూషన్, ఓవర్ స్పీడ్ విషయంలోనూ మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. తనిఖీల్లో గుర్తించిన ఉల్లంఘనలకే పాయింట్లు విధించాలని.. వాహనం నడిపిన వ్యక్తికి మాత్రమే పాయింట్లు విధించేలా మార్పులు చేయనున్నారు. సవరించిన విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నారు అధికారులు. ఇప్పటికే పాయింట్లు విధించిన వారికి వెసులుబాటు కల్పించాలని ఆర్టీఏ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa