హన్మకొండ: వరంగల్ నుంచి పోచంపాడ్ సీఎం సభకు బస్సుల్లో రైతులు భారీగా తరలి వస్తున్నారు. సుమారు 500 బస్సుల్లో రైతులు బయలుదేరారు. హన్మకొండలో జెండా ఊపిన ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బస్సులను ప్రారంభించారు. జగిత్యాల నుంచి రైతులు ట్రాక్టర్లు, బస్సుల్లో పోచంపాడ్ సభకు బయలుదేరారు. 70 ట్రాక్టర్లలో వెళుతున్న రైతుల యాత్రను ఎంపీ కవిత ప్రారంభించారు. త్రివేణి సంగమం అయిన కాళేశ్వరం నుంచి ఎమ్మెల్యే పుట్ట మధు వేద మంత్రాల తో గోదావరి తల్లికి పూజలు నిర్వహించి కలషంలో నీళ్లు తీసుకుని రైతులతో పోచంపాడుకు బయలుదేరారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రం నుండి నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ సభకు భారీగా మహిళలు తరలి వెళుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa