సూర్యాపేట: సూర్యాపేట జిల్లా చింతపల్లి మండలం వజినేపల్లి సమీపంలో ఓ కారు నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారు నడుపుతున్న వ్యక్తి అనుమానం వచ్చి రోడ్డుపక్కన నిలిపి వుంచాడు. అంతలోనే మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. దీంతో అతడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. కారుతో పాటు అందులో ఉన్న తన రూ.24వేల నగదు కూడా కాలి బూడిదైందని వాపోయాడు. రేడియేటర్ బాయిల్ అవ్వడం వల్లే మంటలు చెలరేగి ఉంటాయని బాధితుడు పేర్కొంటున్నారు. నెమలిపురికి చెందిన తన మిత్రుడి వద్ద కారు తీసుకొని వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశాడు.