హైదరాబాద్: తనపై తానే కాల్పులు జరిపించుకొని సినీ ఫక్కీలో పెద్ద హైడ్రామా ఆడిన మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ ను కాల్పుల ఘటనపై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టులో ఇవాళ విక్రమ్ గౌడ్ బెయిల్ పిటిషన్ దాఖలు అయింది. అయితే.. బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ కేసులో రెండో రోజు పోలీసులు ఐదుగురిని విచారిస్తున్నారు.