ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నంద్యాలలో జగన్ కామెడీ షో: బుద్దా వెంకన్న

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 11, 2017, 03:34 PM

విజయవాడ: సీఎం చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో టీడీపీ ఆందోళన చేపట్టింది. జగన్ మొన్న ఒక సభలో మాట్లాడుతూ చంద్రబాబును కాల్చి చంపినా తప్పులేదు అన్నారు. నిన్న ఉరి తీసినా తప్పులేదు అన్నారు. జగన్ చేస్తున్న ఈ వ్యాఖ్యలకు నిరసగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో విజయవాడలో జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వెంకన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ నంద్యాలలో జరిగేది జగన్ కామెడి షో అని ఎద్దేవా చేశారు. అన్ని కోట్లు దోచుకున్న వ్యక్తి ఇండియాలో కాబట్టి 15నెలలు జైల్లో ఉండి బయటికొచ్చాడని.. అదే అరబ్ దేశాలకు జగన్‌ను పంపిస్తే రోజుకోసారి ఉరి తీస్తారన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa