తెలంగాణ వస్తే ఐటీ పడిపోతుందని ఉద్యమసమయంలో భయాందోళనకు గురిచేశారని.. కానీ ఇవాళ దేశంలోనే ఐటీలో హైదరాబాద్ పేరు సంపాదించుకుందన్నారు మంత్రి కేటీఆర్. బంజారాహిల్స్ తాజ్‌డెక్కన్‌లో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ మూడవ వార్షిక సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంపై విస్తృతంగా చర్చ జరిగిందన్న కేటీఆర్.. తెలంగాణ వస్తే అభివృద్ధి కుంటుపడుతుందని అపోహలు సృష్టించారన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని కిరణ్‌కుమార్‌రెడ్డి బయపెట్టారు. రియల్‌ఎస్టేట్ పడిపోతదని అప్పటి నేతలు అన్నారు. హైదరాబాద్‌కు పెట్టుబడులు రావన్నారు. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ సారథ్యంలో మూడేళ్లలోనే గణనీయమైన పురోగతి సాధించాం. తెలంగాణలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర విభజనకు ముందున్న అపోహలన్నీ తొలగిపోయాయి. మనకంటే ముందు ఏర్పడిన రాష్ర్టాలు ఇప్పటికీ కుదురుకోలేదు. దేశమంతా అబ్బురపడేలా సీఎం కేసీఆర్ పాలనలో ముందున్నారని వెల్లడించారు. ఆదాయం వృద్ధి రేటు సహా 12 రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉంది. హైదరాబాద్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా చేస్తున్నామన్న కేటీఆర్.. హైదరాబాద్‌లో క్రైంరేటు గణనీయంగా తగ్గిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa