ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ మ్యూజియంలో మధుబాల మైనపు విగ్రహం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 11, 2017, 04:35 PM

అలనాటి బాలీవుడ్ హీరోయిన్ కి అరుదైన గుర్తింపు లభించింది. మొఘల్ – ఏ- ఆజమ్ చిత్రంలో ప్యార్ కియాతో డర్నా క్యా అంటూ సాగే పాటలో అనార్కలీగా నటించి అందరి మనసులు గెలుచుకున్న హిందీ నటి మధుభాల. దాదాపు 55 చిత్రాలలో నటించిన‌ మధుబాల 1969 లో కన్నుమూశారు. తన 36వ ఏటనే పరమపదించిప్పటికి ఆమె ఎందరో మనసుల్లో చెరగని ముద్రవేసుకున్నారు. అయితే కోట్లాది మంది అభిమానుల మనసులలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మధుబాలకి ఢిల్లీలోని టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని ఆవిష్కృతం చేసారు. మ‌ధుబాల సోద‌రి మ‌ధుర్ బ్రిజి భూష‌న్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అనార్కలీ రూపంలో మధుబాల మైనపు విగ్రహాన్ని రూపొందించగా, ఇది మ‌ధుబాల అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ర్షిస్తుంది. మ‌ధుబాల లాంటి గొప్ప న‌టి మైన‌పు విగ్ర‌హాన్ని ఆవిష్కృతం చేసే అవకాశం తమకు దక్కినందుకు మ్యూజియం నిర్వాహకులు గర్వంగా ఫీలవుతున్నారు. డిసెంబర్ లో మ్యూజియాన్ని తెరవనున్నారు. 1952లో ఓ ప్రముఖ అమెరికా మ్యాగజైన్ మధుబాల ఫోటోని కవర్ పేజీపై ప్రచురించడంతో అంతర్జాతీయంగా ఆమె పేరు మారు మ్రోగింది. అయితే మ‌ధుబాల మైన‌పు విగ్ర‌హాన్ని ఢిల్లీలోని మ్యూజియంలో ఏర్పాటు చేయ‌డం త‌న‌కెంతో ఆనందాన్ని క‌లిగించింద‌ని ఆమె సోద‌రి అన్నారు. మా కుటుంబంలో నేను అంద‌రిక‌న్నా చిన్నా, అందరి త‌ర్వాత నా పెళ్లి జ‌రిగింది. మ‌ధుబాల అక్క‌తో ఎక్కువ స‌మయం గ‌డిపే చాన్స్ నాకు దొరికినందుకు సంతోషం వ్య‌క్తం చేస్తున్నాను అని మ‌ధుబాల సోద‌రి మ‌ధుర్ బ్రిజి భూష‌న్ అన్నారు. 9 సంవ‌త్స‌రాల అనుబంధం మా ఇద్ద‌రిది. తాను లేని లోటు మా మిగ‌తా సిస్ట‌ర్స్ తో పాటు పేరెంట్స్ కి ఎప్ప‌టికి తీర‌నిది. ఆమె తో గడిపిన క్ష‌ణాలు నా హృద‌యంలో ఎప్ప‌టికి చిర‌స్థాయిగా ఉంటాయ‌ని మ‌ధుర్ అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa