ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో లక్ష పెళ్లిళ్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 11, 2017, 04:39 PM

మూడు నెలల తర్వాత మళ్లీ పెళ్లిళ్ల సీజన్ రావడంతలో కల్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్‌లు సందడిగా మారాయి. ఆకాశాన్ని పందిరిగా మార్చి…భూలోకాన్ని పీఠగా పేర్చి వధూవరులు కొత్త జీవితం ప్రారంభించేందుకు శుభ ఘడియలు మొదలయ్యాయి. శుభప్రదమైన శ్రావణ మాసం.. తెలుగు ప్రజల ముంగిళ్లు లక్ష్మి పూజలతోనే కాదు. పెళ్లి సందళ్లతోనూ కళకళలాడే వేళ ఇది. శుక్రవారం(ఆగస్టు-11) నుంచి మొదలు.. 12, 13, 16 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కల్యాణ కాంతులే అబ్బురపరచనున్నాయి. చక్కని ముహూర్తాలు (లగ్నాలు) ఉండటం… శనివారం(ఆగస్టు-12) నుంచి నాలుగు రోజులు వరసగా సెలవులు ఉండటంతో ఈ ముహూర్తాలనే పెట్టుకున్నారు. తెలంగాణ, ఏపీల్లో కలిపి లక్షకుపైగా జంటలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నాయిని అంచనా. ఇలా ముంచుకొచ్చిన ముహూర్తాలతో ఫంక్షన్‌హాళ్లు, కళ్యాణమంటపాలు ఎక్కడికక్కడ బుక్కయిపోయాయి. కొందరికి హాళ్లు దొరకడం కష్టంగా మారింది. పెళ్లిళ్లు జరిగే నాలుగురోజుల్లో ఒక్క పంక్షన్‌ హాలూ ఖాళీగా లేదని హైదరాబాద్‌ నగరంలో పేరుమోసిన కన్వెన్షన్‌ సెంటర్‌ యాజమాని ఒకరు చెప్పారు. అందరూ ఒకే సీజన్‌లో కల్యాణాలకు ముహూర్తాలు పెట్టుకోవడంతో ఫంక్షన్‌హాళ్లు సమకూర్చలేకపోతున్నామన్నారు. పంక్షన్‌హాళ్లకు కొరత కారణంగా ఒకే వేదికలో ఉదయం పెళ్లి… సాయంత్రానికి రిసెప్షన్‌లు పెట్టుకుంటున్నారు. అలాగే చాలా చోట్లా ఒకే ఫంక్షన్‌ హాల్లో రెండు పుటలా పెళ్లిళ్లు జరగున్నాయి. పంక్షన్‌హాళ్లు దొరకని వధూవరుల కుటుంబసభ్యులు కమ్యూనిటీ హాళ్లు, దేవాలయాల కోసం పరుగులు పెడుతున్నారు. ముహూర్తాల వరదతో ఒకే కుటుంబానికి బంధుమిత్రలు నుంచి పదులు సంఖ్యలో ఆహ్వానపత్రికలు వస్తున్నాయి. రానున్న 4 రోజుల్లో తమ బంధువుల ఇళ్లలో ఆర డజనుకుపైగా పెళ్లిళ్లు ఉన్నాయని, ఏ పెళ్లికి వెళ్లాలో ఇంకా నిర్ణయించుకోలేదని ఓ అధికారి చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa