హైదరాబాద్: కాంగ్రెస్ లో చేరే ప్రసక్తే లేదని రాజ్యసభ ఎంపీ డీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. తన పై తప్పుడు వార్తలు కొంతమంది కావాలనే రాస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ లో చేరట్లేదని ఖరాఖండిగా చెప్పిన తర్వాత కూడా పార్టీ మారడం పై వార్తలు రావడం బాధాకరమన్నారు. ఇష్టానుసారం రాస్తూ జర్నలిజం విలువలను దెబ్బతీయొద్దని ఆయన తెలియజేశారు. కొంతమంది పని కట్టుకొని తన గౌరవాన్ని తగ్గించాలని చూస్తున్నట్లు ఆయన చెప్పారు. కొన్ని పత్రికలు, చానెల్స్ ఇష్టానుసారంగా రాయడం పరిపాటిగా మారిందని ఆయన చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు ఎంత మాత్రం నిజం కాదు.. అసత్యాలు అని ఆయన నొక్కి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa