ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్యంత అరుదైన పింక్ డాల్ఫిన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 11, 2017, 05:09 PM

అత్యంత అరుదుగా కనిపించే పింక్ డాల్ఫిన్‌ ఒకటి అమెరికాలోని లూసియానా సముద్రజలాల్లో కనిపించింది. సోషల్ మీడియాలో ఈ పింక్ డాల్ఫిన్ ఇపుడు ట్రెండింగ్‌గా మారింది. సముద్రంలో అత్యంత అరుదుగా కనిపించే పింక్ డాల్పిన్ పింకీ అని స్థానికులు ముద్దుగా పిలిచే ఈ డాల్ఫిన్ వేగంగా వెళ్తున్న షిప్ ముందు సరదాగా దూకుతూ సందడి చేసింది. దీనిని మరో నౌకలో ప్రయాణించే వారు వీడియో తీశారు. ఈ వీడియోలో వేరే డాల్పిన్లతో కలసి సరదాగా వెళ్తున్న పింకీని చూడచ్చు. ఈ పింకీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది. దీనిని నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ పింక్ దాల్ఫిన్స్ అరుదైనవని పరిశోధకులు చెబుతున్నారు. 













SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa