తుప్రాన్: నిజమాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అమరవీరుల స్ఫూర్తి యాత్ర చేపట్టేందుకు వెళ్తున్న తెలంగాణ ఐకాస ఛైర్మన్ ప్రొ.కోదండరాంను ముందస్తుగా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. కోదండరాంను అరెస్ట్ చేసేందుకు తుప్రాన్ మండలం అల్లాపూర్ శివారులో ఉన్న టోల్గేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మెదక్ జిల్లా ఏఎస్పీ ఆధ్వర్యంలో తుప్రాన్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీసు సిబ్బంది హైదరాబాద్ నుంచి నిజమాబాద్ వైపు వెళ్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.